కార్తీ బిగ్ సినిమా రీరిలీజ్..మరోసారి థియేటర్లలో దుమ్మురేపేందుకు రెడీ!

15 Years Later Karthis Sensation Yuganiki Okkadu Roars Back Into Theaters, Yuganiki Okkadu Roars Back Into Theaters, Yuganiki Okkadu Rerelease, Yuganiki Okkadu Movie, Box Office, Karthi, Re Release, Tamil Cinema, Yuganiki Okkadu, 15 Years Later Yuganiki Okkadu Roars Back Into Theaters, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొత్తేం కాదు. గతంలో ఎన్నో సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధించాయి. ఓవైపు క్లాసిక్ హిట్స్, మరోవైపు అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని సినిమాలు కూడా రీరిలీజ్ ద్వారా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమా కూడా చేరబోతోంది. అతని కెరీర్‌కు మలుపుతిప్పిన “యుగానికి ఒక్కడు” మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

కార్తీ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విశేషమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. 2000s చివరలో వచ్చిన “యుగానికి ఒక్కడు” సినిమా అతని కెరీర్‌లో గేమ్‌చేంజర్‌గా నిలిచింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి, అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. రీమా సేన్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటుడు ఆర్. పార్థిబన్ కీలక పాత్ర పోషించారు. యాక్షన్, అడ్వెంచర్, ఫెంటసీ మేళవించిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మార్చి 14న గ్రాండ్ రీరిలీజ్ – హైప్ తారాస్థాయికి!
ఈ సూపర్ హిట్ సినిమాను 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 14న ఏపీ, తెలంగాణతో పాటు, కర్ణాటక, అమెరికాలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు ఈ రీరిలీజ్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఇప్పటికే రీరిలీజ్ ట్రెండ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. “యుగానికి ఒక్కడు” వంటి విజువల్ వండర్ మళ్లీ థియేటర్లలో చూడాలనుకునే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 15 ఏళ్ల తర్వాతనూ ఈ సినిమా అదే మేజిక్ రిపీట్ చేస్తుందా? బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుందా? అనే ఆసక్తి నెలకొంది.