అదుపు అదుపు ..మాట పొదుపు అనేది సినిమా డైలాగే అయినా ..జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నోటికి అడ్డు అదుపు లేదని ఎంత వస్తే అంత మాట్లాడితే ఇప్పుడు నటుడు, వైసీపీ నేత అయిన పోసానిలా పడరాని పాట్లు పడాల్సిందే . పదే పదే జైళ్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. నిజానికి రాజకీయాలలోకి వచ్చాక నోటి వెంట వచ్చే ప్రతీ మాట..పరిధులు దాటి మాట్లాడితే తప్పకుండా పనిష్మెంట్ అనుభవించాల్సిందే.
అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు..ప్రతిపక్ష పార్టీల మీద అధికారపార్టీ నేతలు కౌంటర్లు విసురుకోడం మామూలే. కానీ అది కాస్తా లిమిట్ దాటితే అప్పుడు కాకపోయినా ఆ తర్వాత అయినా అయ్యో అనవసరంగా అప్పుడు నోరు జారానే..అని అనుక్షణం బాధపడేలా పరిస్థితులు వస్తాయి. అప్పుడు పోలీసుల ముందు కన్నీరు పెట్టినా.. జడ్జిముందు వెక్కి వెక్కి ఏడ్చినా ఆ పాపం మాత్రం వెంటాడుతూనే ఉంది. దీనికి హండ్రెడ్ పర్సంట్ ఉదాహరణ.. పోసాని కృష్ణ మురళి.
ప్రత్యర్ధులపై విమర్శలు చేయడానికి హుందాతనం ప్రదర్శించాలి. ఇది తెలియకే వెనుక రెచ్చగొడుతున్నారనో.. వ్యూస్ బాగా వస్తున్నాయని మీడియా ముందు రెచ్చిపోతే ఫలితం కూడా చాలా దారుణంగా ఉంటుంది. పోసాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. కానీ తన అభిమానాన్ని చాటుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడడం.. వారి కుటుంబ సభ్యులను తిట్టడం చేయకూడదు. అందుకే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ జైలులో బాధపడుతున్నారు.
అయితే అదే పోసాని కృష్ణ మురళి 70 ఏళ్ల వయసులో ఏ తప్పూ చేయని చంద్రబాబును అరెస్టు చూసినప్పుడు హేళనగా మాట్లాడారు. నిజాయితీగా బయటపడు .. జైలు జీవితం అనుభవించి బయటకు రా అంటూమ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు జైలులోకి వెళ్లాక కానీ జైలు జీవితం ఎలా ఉంటుందో అర్ధం కాలేదేమో. అందుకే అంటారు దేవుడు ఊరుకున్నా కర్మ మాత్రం చూస్తూ ఊరుకోదు అంటారు. తాజాగా పోసాని బెయిల్ ఇవ్వకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని చెబుతూ గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ముందు బోరున విలపించడం కర్మ ఫలితమే.
అయితే న్యాయస్థానంలో సెంటిమెంట్లకు కరిగే వారుండరు కనుక పోసానికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. దీంతో తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు ఆయనను. కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన పోసానిపై వరుస వరుసగా కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో పీటీ వారెంటుతో పోలీసులు రెడీగా ఉండటం పోసాని ఏమాత్రం ఊహించలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకుంటాడో..లేక అలవాటయిన నోటికి అదే పనిగా పని చెబుతారో చూడాలి. ఏది ఏమయినా పోసాని ఎపిసోడ్ నోటిని అదుపులో పెట్టుకోలేని మరో రాజకీయనాయకుడికి ఒక గుణపాఠమే అవుతుంది.