ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది – సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Disburses Rs 193.31 Cr Fourth Installment of YSR Nethanna Nestham Scheme at Pedana Krishna District, Fourth Phase YSR Nethanna Nestham Funds, YSR Nethanna Nestham Funds, AP CM YS Jagan Pedana visit, AP CM YS Jagan Pedana Tour, YSR Nethanna Nestham, 2022 YSR Nethanna Nestham, AP CM YS Jagan Mohan Reddy, Pedana, YSR Nethanna Nestham News, YSR Nethanna Nestham Latest News And Updates, YSR Nethanna Nestham Live Updates, Mango News, Mango News Telugu,

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత రూ.193.31 కోట్ల నగదును లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, చీఫ్ విప్‌లు సామినేని ఉదయభాను, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, కే పార్ధసారధి, అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ప్రసంగం లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే..

  • దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది, అలాంటి మగ్గం నేసే నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతోంది.
  • ఇప్పటివరకు వారికి అండగా ఏ ప్రభుత్వం నిలబడలేదు, కానీ మా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది.
  • నేతన్నల జీవితాల లోని కష్టాలను నా పాదయాత్రలో గమనించా, అందుకే వారిని ఆదుకునేలా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ రూపొందించాం.
  • పథకం ప్రారంభించినప్పటినుండి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు నగదు అందిస్తున్నాం.
  • ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు, అలాగే నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం అందనుంది.
  • లంచాలకు, అవినీతికి తావు లేకుండా 80,546 మంది నేతన్నలకు నేరుగా వారి ఖాతాల్లోకి నేడు రూ. 193.31 కోట్లు జమ చేస్తున్నాం.
  • కుల,మతాలకు అతీతంగా ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు నగదును పంపిణీ చేశాం, అలాగే వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 సాయం అందించాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − thirteen =