భారతీయులలో చాలామంది ప్రయాణాలంటే చాలు తెగ మక్కువ చూపిస్తారు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా భారతీయ టూరిస్టులతో కళకళలాడుతూ ఉంటాయి.
ఇండియా అనే కాదు.. విదేశాలకు వెళ్లడానికి కూడా భారతీయ టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఓ రిపోర్టు ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేసిన ఖర్చు 12,500 కోట్ల రూపాయలు. అది కూడా అది ఈ ఏడాది మొత్తం కాదట..కేవలం ఒక నెల రోజులకు మాత్రమే ఇంత ఖర్చు పెట్టారట.
అయితే ఇలాంటివారంతా విదేశాలకు వెళ్లాలన్నా.. పాస్ పోర్టు ఉన్నా వీసా సమస్యతో ఆగిపోతున్నారు. కానీ పాస పోర్ట్ ఉంటే చాలు విదేశాలు చూసే అవకాశాన్ని కొన్ని కంట్రీలు ఇచ్చాయి. అయితే ఇలా మూడు గంటల్లోనే చేరుకునే దేశానికి వెళ్లడానికి భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారట. వీసా లేకుండా చాలా దేశాలకు అనుమతి ఉన్నా.. చాలామంది కజకిస్థాన్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారట.
దీనికోసం కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు టూరిస్టులు. కజకిస్థాన్‌కు వీసా తంటాలేమీ లేవు. పైగా.. భారత పాస్ పోర్టు ఉంటే చాలు. 2022లో భారత ప్రయాణీకులకు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని కజకిస్థాన్ ఆమోదించింది. దీని ప్రకారం.. 180 రోజులలో ఒక భారతీయుడు మూడు సార్లు 14 రోజులపాటు అక్కడ వీసా లేకుండా ఎంచక్కా ఉండొచ్చు. అదీగాక ఇక్కడ ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
దీనికి తోడు మూడు గంటల్లోనే కజికిస్తాన్ చేరుకోవచ్చు . కజికిస్తాన్ లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. వీటిలో అల్మటి, అస్తానా,టర్కిస్థాన్, నుర్ సుల్తాన్, షిమ్కెంట్, అక్టావు, కోక్ టొబ్, లేక్ కైండి, చరిన్ కన్యొన్ నేషనల్ పార్క్, కోల్సె నేషనల్ పార్క్ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకోవడంలో ముందుంటాయట. అందుకే ఆ దేశానికి భారతీయులు క్యూ కడుతున్నారని తాజా నివేదిక చెబుతోంది.