వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌.. ఫైనల్స్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు నీర‌జ్ చోప్రా, రోహిత్‌ యాద‌వ్, ఎల్దోస్ పాల్

World Athletics Championships Neeraj Chopra Rohit Yadav and Eldhose Paul Enters Finals To Create History For India, Rohit Yadav and Eldhose Paul Enters World Athletics Championships Finals To Create History For India, Neeraj Chopra Enters World Athletics Championships Finals To Create History For India, Rohit Yadav Enters World Athletics Championships Finals To Create History For India, Eldhose Paul Enters World Athletics Championships Finals To Create History For India, Neeraj Chopra Secures Position In Maiden World Championship Finals In Javelin, Maiden World Championship Finals In Javelin, Javelin Maiden World Championship Finals, Maiden World Championship Finals, World Athletics Championships Finals, Neeraj Chopra Secures Position In Javelin Maiden World Championship Finals, Neeraj Chopra qualified for his maiden World Championships final with a stunning first attempt throw of 88.39m here, Olympic Javelin champion Neeraj Chopra, Olympic champion Neeraj Chopra, maiden World Championships final, Olympic champion, Neeraj Chopra, Javelin Maiden World Championship Finals News, Javelin Maiden World Championship Finals Latest News, Javelin Maiden World Championship Finals Latest Updates, Javelin Maiden World Championship Finals Live Updates, Mango News, Mango News Telugu,

అమెరికాలో జ‌రుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. ఒరెగాన్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్స్‌లో మొత్తం ముగ్గురు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రెండు విభాగాల్లో సత్తా చాటి ఫైన‌ల్‌కు అర్హత సాధించారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో.. ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్ మరియు ఎల్దోస్ పాల్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. ప్రపంచ అథ్లెటిక్స్ హిస్ట‌రీలో ఇద్ద‌రు భారత ఆటగాళ్లు ఫైన‌ల్‌కు చేర‌డం ఇదే తొలిసారి. తొలి ప్ర‌య‌త్నంలోనే నీర‌జ్ చోప్రా త‌న జావెలిన్‌ను 88.39 మీట‌ర్ల దూరం విసిరి ఫైన‌ల్‌కు చేరుకోగా, మ‌రో అథ్లెట్ రోహిత్ యాద‌వ్ కూడా త‌న జావెలిన్‌ను 80.42 మీట‌ర్ల దూరం విసిరి పదో స్థానంలో నిలవడం ద్వారా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. కాగా గ్రూపు ఏ నుంచి పోటీలోకి దిగిన నీర‌జ్ చోప్రా క్వాలిఫికేష‌న్ ఫస్ట్ త్రోలోనే త‌న జావెలిన్‌ను 88.39 మీట‌ర్ల దూరం విసిరి ఫైన‌ల్‌కు క్వాలిఫై అవడం విశేషం.

ఇక మరో భారత ఆటగాడు ఎల్డోస్ పాల్ పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి అడుగు పెట్టాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో పాల్ 16.68 మీట‌ర్ల దూరం దూకి 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌త అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే మొదటిసారి. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం ఫైన‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. కాగా భారత ఆటగాళ్ల విజయంపై కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. ఈ ముగ్గురు క్రీడాకారులు తమ అసాధారణ ప్రతిభతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారతదేశానికి గొప్ప స్థానం కల్పించారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =