తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కొత్తగా నెహ్రూ ఓఆర్ఆర్లో ఉన్న కొల్లూరు ప్రాంతానికి.. సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్‌ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో.. అక్కడ ఆరు లైన్ల మెయిన్ రోడ్డు మాత్రమే ప్రస్తుతం ఉంది. ఇటీవల ఈ సర్వీసు రోడ్డుకు కూడా మార్గం సుగమం అవడంతో అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీంతో రైల్వే ట్రాక్‌పై కొల్లూరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతుండటమే కాదు..ఈ పనులు తుదిదశకు కూడా చేరుకున్నాయి.
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలను కలుపుతూ .. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే మార్గం ఏదైనా ఉందంటే అది నెహ్రూ ఓఆర్ఆర్ మాత్రమే. అయితే ఈ రోడ్డుకు కొల్లూరు తర్వాత నుంచి సర్వీసు రోడ్డు లేదు. దీంతో కొల్లూరు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇప్పుడు వీరందరికీ పరిష్కారం లభించినట్లయింది.
కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్‌ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడ ఆరు లైన్ల ప్రధానం రోడ్డు మాత్రమే ఉంది. కొల్లూరు నుంచి పటాన్చెరు వరకు కూడా సర్వీసు రోడ్డు లేకపోవడంతో పాటు ఉన్న రోడ్డుకూడా కొంత దూరం మాత్రమే ప్రజలకు ప్రయాణం చాలా కష్టంగా మారింది. దీంతో ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి.. టోల్‌చార్జీలు చెల్లించి మరీ మరొక ఇంటర్‌ఛేంజ్ వద్ద తిరిగి రావలసి వస్తుంది. దీంతో.. ప్రయాణ సమయానికి అదనపు సమయంతో పాటు అదనపు ఖర్చు కూడా అవుతుంది. తాజాగా సర్వీసు రోడ్డుకు మార్గాన్ని సుగమం చేస్తూ.. రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తుండటంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రైల్వే ట్రాక్‌పై కొల్లూరు వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు తుదిదశకు చేరుకున్నాయి. అయితే ఈలోగా హెచ్ఎండీఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జికి ర్యాంపులు నిర్మించి.. ఆ ప్రాంతాన్ని సరిగ్గా వాడుకోవడానికి అనువైన న రోడ్డు మార్గాన్ని అందించడానికి ప్లాన్ చేశారు. నాలుగు లైన్లతో రెండు ర్యాంపులను రూ 23.56 కోట్లతో నిర్మించడానికి టెండర్లను కూడా విడుదల చేశారు. ఈ సర్వీసు రోడ్డు వేస్తే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది. ఈ కొత్త సర్వీసు రోడ్డు వల్ల కొల్లూరు నుంచి పటాన్‌చెరుకు సులభంగా వెళ్లే అవకాశం రావడంతో పాటు.. ర్యాంపులను కూడా అందించే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.