స్టూడెంట్స్ డ్రీమ్స్‌కు గండికొట్టిన ట్రంప్‌ ..

Trump Crushed Students Dreams

అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన పాలనలో మరింత దూకుడు పెంచడంతో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అటు అమెరికన్లను,మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ పేరుతో ఇటు విదేశీయులను ట్రంప్ ఇబ్బంది పెడుతున్నారు. తన 2.0 పాలనలో 2నెలలుగా ట్రంప్ సంచలన నిర్ణయాలతో ఇటు అమెరికన్లను అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు . ఇప్పటికే అక్రమ వలసలనపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుని విద్యార్ధుల కలలకు గండి కొట్టారు.

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ 2.0 పాలనలో దూకుడు, స్పీడ్‌తో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అమెరికన్లను, మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ పేరుతో విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాడు. అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్నా..ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను కఠినతరం చేశారు. తాజాగా ఇప్పుడు వీసాల్లో కోత పెడుతున్నారు.

తాజాగా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీలయితే అక్కడే స్జిరపడాలని చాలామంది విద్యార్థుల కలలు కంటారు.అందుకే ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ ఈ లక్ష్యంతోనే అగ్రరాజ్యం బాట పడుతున్నారు. అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాలు F–1పై కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా వీసా జారీల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవడం అనేది..గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని నిపుణులు చెబుతున్నారు.

2023–24లో 6.79 లక్షల F–1 వీసా దరఖాస్తులు రాగా.. వీటిలో 2.79 లక్షలు అంటే 41% తిరస్కరించబడ్డాయని అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 2022–23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు అంటే 36% ఆమోదం పొందలేదని.. దీనికి భిన్నంగా, 2013–14లో 7.69 లక్షల దరఖాస్తుల్లో 1.73 లక్షలు అంటే 23% మాత్రమే తిరస్కరణకు గురయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వీసా తిరస్కరణ రేటు పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో.. భారతీయ విద్యార్థుల విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 తొలి 9 నెలల్లో F–1 వీసాల జారీ 38% తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు వరకు చూసుకుంటే.. కేవలం 64 వేల మందికి వీసాలు మంజూరయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది. అంటే కరోనా తర్వాత ఇండియన్ స్టూడెంట్స్‌కు వీసాలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నాయి.

F–1 వీసా అంటేనే నాన్‌–ఇమిగ్రెంట్‌ వీసా. అమెరికాలో ఫుల్‌ టైమ్‌ స్టడీస్ కోసం విదేశీ స్టూడెంట్స్‌కు అనుమతినిస్తుంది. అమెరికా విద్యాసంస్థలు ఏటా రెండు సెమిస్టర్‌లలో ఆగస్టు నుంచి డిసెంబర్, జనవరి నుంచి మే వరకూ ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆగస్టు సెమిస్టర్‌లో వెళ్తుండటంతో..ఇప్పుడు కఠిన వీసా విధానాలతో విద్యార్ధుల కలలు కల్లలవుతున్నాయి. ఈ తిరస్కరణల వెనుక అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం వంటి కారణాలున్నట్లు తెలుస్తోంది.