నో బ్యాగ్ డే రోజు విద్యార్ధులు ఏం చేయాలి?

ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇకపై విద్యార్థులపై విద్యాభారాన్ని, ఒత్తడిని తగ్గించి, విభిన్న అభ్యాసనా విధానాలను అందించి.. స్టూడెంట్స్ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలనే లక్ష్యంతో ‘నో బ్యాగ్ డే’ అనే వినూత్న కార్యక్రమాన్ని లోకేష్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. దీనివల్ల 1 నుంచి పదోతరగతి వరకూ విద్యార్థులు ఇకపై ప్రతి శనివారం పాఠశాలలకు బ్యాగులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. అయితే నో బ్యాగ్ డే స్పెషల్ ఏంటి? ఆరోజు ఏం చేస్తారనే ప్రశ్నలు విద్యార్ధులలో తలెత్తుతున్నాయి.

ఈ నో బ్యాగ్ డేలో స్టూడెంట్స్ కోసం ఆసక్తిక కార్యకలాపాలను చాలానే రూపొందించారు. వాటిలో క్విజ్‌లు, సెమినార్లు, డిబేట్స్, క్రీడా పోటీల ద్వారా స్టూడెంట్స్‌లో క్రియేటివిటీ పెంచే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే గ్రూప్ ఇంటర్వ్యూలు, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళికలో వృత్తి శిక్షణ, లలిత కళలు, లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచే కార్యక్రమాలను చేర్చడానికి విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు.

ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అనే మహోన్నతమైన టార్గెట్‌తో ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్‌ను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపడానికి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. స్కూలు విద్యలో లోకేష్ చేపట్టిన సంస్కరణలు ఇప్పటికే ఆశాజనకమైన ఫలితాలను అందిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మంత్రి ఆరు నెలల సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా.. ఈ నో బ్యాగ్ డే కార్యక్రమంలో స్కిల్ టెస్టులు, క్లబ్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్ బీ కాంపిటేషన్, లలిత కళలు, వృత్తి విద్య, వినోద క్రీడలు, ఆర్ట్స్, మోడల్ పార్లమెంట్ మీటింగ్స్ మరెన్నో యాక్టివిటీస్ వల్ల స్టూడెంట్స్‌కు అవసరమైన స్కిల్స్ మెరుగుపడతాయి.

మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ను లెర్నింగ్‌ను బలోపేతం చేయడానికి టీచర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఏ వారానికి ఆ వారం నేర్చుకున్న పాఠాలపై స్టూడెంట్స్‌కు అవగాహనను పెంచడానికి వేయడానికి ఒక చిన్న టెస్టును పెడతారు.అలాగే విద్యార్థుల్లోని క్రియేటివిటీని వెలికితీసేందుకు డ్రాయింగ్, క్లే మోడలింగ్, తోటపని వంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటివి నేర్చుకుంటే.. వృత్తి విద్య ద్వారా స్టూడెంట్స్‌కు వివిధ రంగాల్లో నైపుణ్యం లభిస్తుంది. మోడల్ పార్లమెంట్ మీటింగ్స్ వంటివి స్టూడెంట్స్ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి సహాయపడతాయి.దీంతో నో బ్యాగ్ డే కోసం ఇప్పటి నుంచే విద్యార్థులంతా వెయిట్ చేస్తున్నారు.