బిహార్ చేపలను చూడటానికి పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారు – ప్రధాని మోదీ

PM Modi Mocks Rahul Gandhi on Fishing With Fishermen in Bihar Campaign

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగి చేపలు పట్టిన సంఘటనను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ వ్యంగ్యాస్త్రాలు:

బిహార్ చేపలను చూడటానికి పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారు. ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారంటూ” రాహుల్ గాంధీని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. బిహార్‌లోని మత్స్యకారుల కోసం కృషి చేస్తున్నట్లు చూపుకోవడానికి రాహుల్ గాంధీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పరోక్షంగా విమర్శించారు.

రాహుల్ చేపల వేట:

కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. అప్పుడు ఆయన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చేపల మార్కెట్ల ఏర్పాటు, బీమా సదుపాయం, వేట నిషేధిత కాలంలో కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చారని కాంగ్రెస్ వెల్లడించింది.

ప్రియాంక గాంధీ విమర్శలు:

ఇదే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా బీజేపీపై విమర్శలు చేశారు. రూ.10 వేలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టొచ్చని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తన ఇద్దరు కార్పొరేట్ స్నేహితులకే అప్పగిస్తున్నారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here