ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం (నవంబర్ 8, 2025) నాడు తిరుపతి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా అటవీ సంరక్షణ మరియు ఎర్ర చందనం నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు.
తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు.
అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఎర్రచందనం, అంకుడు,… pic.twitter.com/8PB3QNev5j
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
ఈ సందర్భంగా అటవీ సంరక్షణ చర్యలు, ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధం, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పర్యటనలో భాగంగా పవన్ మొదటగా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలోని పచ్చదనం, అటవీ సంపదను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు.
అనంతరం, అటవీ సంరక్షణ పట్ల తన నిబద్ధతను చాటుతూ, ఆ ప్రాంతంలో కొన్ని మొక్కలు నాటారు. ఆ తరువాత, మంగళం లోని ఎర్ర చందనం గోదామును పరిశీలించారు. అక్కడ నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగల నాణ్యత, భద్రత, ప్రస్తుత నిల్వలను ఆయన తనిఖీ చేశారు.
తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి… pic.twitter.com/OPv936UetV— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో విలువైన ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టడం, సక్రమమైన మార్గంలో దానిని విక్రయించడం ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే అంశాలపై దృష్టి సారించారు. అనంతరం, తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో అటవీ అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
కాగా, మామండూర్ అటవీప్రాంతం, కొన్ని అత్యంత విలువైన స్థానిక మరియు అంతరించిపోతున్న జాతులతో పాటు అధిక స్థాయిలో జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటుంది.








































