పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ వర్గీయుల రాళ్ల దాడి, ఎమ్మెల్యే వాహనం ధ్వంసం

High Tension Prevails in Puttaparthi Due To TDP and YCP Cadres Pelted Stones MLA's Vehicle Vandalized,High Tension Prevails in Puttaparthi,High Tension Prevails in Puttaparthi Due To TDP,YCP Cadres Pelted Stones,MLA's Vehicle Vandalized,Mango News,Mango News Telugu,Duddukunta Sridhar Reddy,Tension At Puttaparthi,Palle Raghunatha Reddy,Puttaparthi,Puttaparthi Duddukunta SreedharReddy,Duddukunta Sreedhar Reddy Vs Palle Raghunatha Reddy,Puttaparthi Latest News,Puttaparthi Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లతో ఈ పరిస్థితి నెలకొంది. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆయన వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ముందుగా సవాల్ చేసుకున్న సమయానికి ఇరువురు నేతలు ఈరోజు ఉదయం సత్యమ్మ దేవలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇరువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో పల్లె రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఇక పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని గ్రహించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని సత్తెమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + seven =