జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే

AP High Court Gives Stay on ZPTC, MPTC Elections in the State, Andhra Pradesh, Andhra Pradesh State Election Commission, AP Coronavirus, AP MPTC, AP MPTC Elections, ap mptc zptc elections, AP MPTC ZPTC Elections 2021, AP ZPTC, AP ZPTC And MPTC Elections On 8th April, AP ZPTC Elections, Holiday Announced on April 7 8 in AP in the View of ZPTC MPTC Elections, Mandal Parishad and Zilla Parishad Territorial, Mango News, MPTC and ZPTC Elections, MPTC ZPTC Elections, MPTC ZPTC Elections Polling, YS Jagan Mohan Reddy, ZPTC and MPTC elections

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) బ్రేక్ పడింది. ఈ ఎన్నికలను నిలిపివేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేలా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా గత సంవత్సరంలో మార్చి 14న నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాయి.

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు కూడా విన్న అనంతరం ఎన్నికల పక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ విషయంలో ఏప్రిల్ 15 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘంను (ఎస్‌ఈసీ) కోర్టు ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =