ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Attends Telangana Poet Ande Sri Last Rites at Ghatkesar

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డాక్టర్. అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఈ ఉదయం ప్రారంభమైన ఆయన అంతిమ యాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లో అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఇక ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా అందెశ్రీ పార్థీవ దేహానికి సీఎం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివంగత కవి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, అందెశ్రీ పాడెను మోయడం గమనార్హం.

సీఎంతో పాటుగా పలువురు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. అందెశ్రీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, సోమవారం ఉదయం అందెశ్రీ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here