కార్తీక మాసంలో దీపారాధన విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి, ఇంటి గుమ్మం వద్ద, తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం శుభప్రదం .
శ్రీవాణి గోరంట్ల భక్తి ఛానెల్లో ఈ దీపారాధన విశిష్టతను వివరించారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, చక్కటి ఆరోగ్యం, సంతానం ప్రాప్తిస్తాయని, మనస్సులోని అజ్ఞానమనే అంధకారం తొలగి జ్ఞాన కాంతి కలుగుతుందని తెలిపారు. నేటి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయాలు వీడియోలో అందుబాటులో ఉన్నాయి.







































