భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (నవంబర్ 21) తిరుపతి నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది.
స్వాగతం పలికిన ప్రముఖులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఆర్మీ అధికారులు, డీజీపీ బి. శివధర్ రెడ్డి మరియు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
పర్యటన షెడ్యూల్
-
రాజ్‌భవన్‌కు పయనం: విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
-
కార్యక్రమం: శుక్రవారం మధ్యాహ్నం, ఆమె బోలారం, రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవ్ 2025 యొక్క రెండవ ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు.
-
విడిది: రాష్ట్రపతి రాజ్‌భవన్‌లో రాత్రికి బస చేస్తారు.
-
తిరుగు ప్రయాణం: శనివారం (నవంబర్ 22) ఉదయం 9:30 గంటలకు ఆమె పుట్టపర్తికి బయలుదేరనున్నారు. అక్కడ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలలలో పాల్గొననున్నారు.
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.




































