కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

Telangana Congress Issues Expulsion Orders over Marri Shashidhar Reddy for Anti-Party Activities,Senior leader Marri Shasidhar Reddy,Expulsion From Congress party,Marri Shasidhar Reddy Expelled,Marri Shasidhar Reddy,Mango News,Mango News Telugu,Congress Party,Telangana Congress Party,Indian National Congress, Congress Party Telangana,Congress Party Indian,Congress Party Latest News And Updates,congress party leaders in telangana,tpcc members list,telangana congress leaders,telangana congress president,Indian National Congress President,Congress President Mallikarjun Kharge

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా చర్య కమిటీ ఛైర్మన్ జి.చిన్నా రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

“బీజేపీలో చేరాలనే ప్రతిపాదనతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తో కలిసి నవంబర్ 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి సమావేశం కావడంపై టీపీసీసీ క్రమశిక్షణా చర్య కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అలాగే నవంబర్ 19న టీపీసీసీ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరియు మాటలు కూడా చర్చించబడ్డాయి. మర్రి శశిధర్ రెడ్డి యొక్క కార్యకలాపాలను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని పవిత్రమైన క్రమశిక్షణా నియమాలు మరియు మార్గదర్శకాలతో పరిశీలించాం. మర్రి శశిధర్ రెడ్డి పరిస్థితి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ధోరణిని దృష్టిలో ఉంచుకుని ఆయనను ఆరేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి తక్షణమే బహిష్కరించబడ్డాడు మరియు అందుకు సంబంధించి ఆమోదం కోసం ఏఐసీసీకి పంపించాం” అని జి.చిన్నా రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 11 =