ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించడానికి అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు (బుధవారం) ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాక్ అసెంబ్లీ (AP Mock Assembly) కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరయ్యారు. ఈ మాక్ అసెంబ్లీలో సభా కార్యక్రమాలు పూర్తిగా విద్యార్థి ప్రతినిధులచే నిర్వహించబడ్డాయి.
మాక్ అసెంబ్లీ (మినీ టు మినిట్) కార్యక్రమం వివరాలు
| సమయం (ఉదయం) | కార్యక్రమం | ముఖ్యాంశాలు |
| 09:30 – 09:40 | సభ ప్రారంభం, స్పీకర్ ఎంపిక | ప్రొటెం స్పీకర్ ఆగమనం, స్పీకర్ ఎంపిక, స్పీకర్‌ను సీఎం, ప్రతిపక్ష నేతలుగా విద్యార్థులు ఎస్కార్ట్ చేయడం. |
| 09:40 – 09:45 | ప్రారంభ వ్యాఖ్యలు | స్పీకర్, పార్టీ నాయకులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధుల ప్రారంభ వ్యాఖ్యలు, స్పీకర్‌కు అభినందనలు. |
| 09:45 – 10:20 | ప్రశ్నోత్తరాలు | 35 నిమిషాల పాటు ప్రశ్నలు, సమాధానాలతో కూడిన ప్రశ్నోత్తరాల సమయం. |
| 10:20 – 10:35 | జీరో అవర్ | సభలో అత్యవసర ప్రజా సమస్యలపై 15 నిమిషాల పాటు జీరో అవర్. |
| 10:35 – 10:55 | శాసనసభ బిజినెస్ | సోషల్ మీడియా యూస్ బిల్, పర్యావరణ పరిరక్షణ బిల్లులు సభ ముందుకు రావడం, చర్చించడం. |
| 10:55 – 11:00 | స్పీకర్ ముగింపు వ్యాఖ్యలు | సభాపతిగా ఉన్న విద్యార్థి ప్రతినిధి ముగింపు వ్యాఖ్యలు. |
ముఖ్య అతిథుల ప్రసంగాలు, ప్రతిజ్ఞ
మాక్ అసెంబ్లీ అనంతరం, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది:
-
11:00 AM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫోటోకు నివాళులు అర్పించడం.
-
11:05 AM: చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ రాజ్యాంగం మరియు పరిపాలన విలువలపై ప్రసంగం.
-
11:10 AM: మంత్రి నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధిపై ప్రసంగం.
-
11:20 AM: స్పీకర్ అయ్యన్నపాత్రుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు చర్చలపై సందేశం.
-
11:30 AM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలు, యువతకు విజన్ వంటి అంశాలపై కీలక ఉపన్యాసం.
-
12:00 PM: చిన్నారుల కోసం రూపొందించిన రాజ్యాంగ ప్రతి పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయడం.
-
12:10 PM: రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయడం.
-
12:30 PM: అసెంబ్లీ భవనాలను విద్యార్థులకు సిబ్బంది చూపించడం.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శాసనసభ పనితీరు, ప్రజాస్వామ్య విలువలు మరియు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యక్ష అవగాహన లభిస్తుంది.






































