అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం వై.ఎస్ జగన్

AP CM YS Jagan America Tour Schedule,YS Jagan Second Foreign Trip,Mango News,Andhra CM Ys Jagan Mohan Reddy Latest News,Jagan Mohan Reddy Latest News,CM YS Jagan America Tour Begins From Today,Andhra Pradesh Latest News,Andhra Pradesh Political News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15 రాత్రి, తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తరువాత రాజభవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గన్నవరం నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 9.50 నిముషాలకు అమెరికా బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన వివరాలను సీఎం కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు వ్యక్తిగత పనులు ఉండడంతో ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులను వాడుకోవడం లేదని చెప్పారు.

ఆగస్టు 16న అమెరికా చేరుకొని, అదే రోజు అమెరికా రాయబారితో, బిజినెస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. ఆగస్టు 17న డల్లాస్ చేరుకొని, నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్ళను కలుసుకుని ఆ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో బిజినెస్ ప్రతినిధులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 19,20,21 తేదీల్లో వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. ఆగస్టు 22న షికాగో లో ప్రతినిధులను కలుసుకుని, ఆ రోజు రాత్రే తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=Z2vPNdah4Yo]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =