IITian Telugu Vlogsలో విడుదలైన రోహిత్ సురిశెట్టి ఇంటర్వ్యూ, దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్ వరకు తన ప్రయాణాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు. వైజాగ్ నుంచి సాగిన ఈ ప్రయాణంలో, ఐఐటీ కోర్సును ఎంచుకోవడానికి ప్రేరణ, ప్రిపరేషన్ సమయంలో రోజుకు ఎన్ని గంటలు చదివారు వంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రారంభంలో క్యాంపస్‌కి అలవాటు పడటానికి పడ్డ కష్టాలను , ఆ తర్వాత జీవితంలో ఎదురైన వైఫల్యాలను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారో రోహిత్ వివరించారు. ఐఐటీకి వెళ్లాలనుకునే విద్యార్థులు, వారికి సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎలాంటి విధానాలను అనుసరించాలో ఆయన సలహా ఇచ్చారు. IITian Telugu Vlogs ప్రారంభించడానికి గల కారణంతో పాటు, పలు ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో రోహిత్ సురిశెట్టి పంచుకున్నారు.





































