వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మొత్తం ఎన్నంటే?

Telangana Govt Released 2026 Public Holidays Calendar, Declares 27 General and 26 Optional Days

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులను మరియు 26 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న 27 సాధారణ సెలవు దినాలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయబడతాయి.

సాధారణ సెలవు దినాలు (General Holidays)

2026 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ముఖ్యమైన సాధారణ సెలవులు:

  • సంక్రాంతి (జనవరి 15)

  • గణతంత్ర దినోత్సవం (జనవరి 26)

  • హోలీ (మార్చి 3)

  • ఉగాది (మార్చి 19)

  • ఈదుల్ ఫితర్ / రంజాన్ (మార్చి 21)

  • శ్రీ రామ నవమి (మార్చి 27)

  • డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)

  • ఈదుల్ అజహా / బక్రీద్ (మే 27)

  • బోనాలు (ఆగస్టు 10)

  • స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)

  • వినాయక చవితి (సెప్టెంబర్ 14)

  • విజయ దశమి / దసరా (అక్టోబర్ 20)

  • దీపావళి (నవంబర్ 8)

  • క్రిస్మస్ (డిసెంబర్ 25)

ఐచ్ఛిక సెలవులు (Optional Holidays)

ప్రభుత్వం మొత్తం 26 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించింది. వీటిలో కొన్ని:

  • న్యూ ఇయర్ డే (జనవరి 1)

  • కనుమ (జనవరి 16)

  • శ్రీ పంచమి (జనవరి 23)

  • మహావీర్ జయంతి (మార్చి 31)

  • బుద్ధ పౌర్ణమి (మే 1)

  • నరక చతుర్దశి (నవంబర్ 8)

  • క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24)

సాధారణ సెలవులతో పాటు, ఆదివారాలు మరియు రెండవ శనివారాలు యథావిధిగా సెలవు దినాలుగా కొనసాగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here