తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అధిష్టానం గొప్ప బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తోంది. సంక్రాంతి వరకు సభ్యత్వాల నమోదు కొనసాగుతుండగా, ఇప్పటివరకు 96 లక్షల మంది సభ్యులుగా చేరారు. కోటి సభ్యత్వాల లక్ష్యాన్ని టీడీపీ చేరుకునే దిశగా దూసుకుపోతోంది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు బీమా సౌకర్యం అమలులో ఉంటుంది. తొలివిడతలో టీడీపీ రూ.42 కోట్లు ప్రీమియంగా చెల్లించింది.
నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి మొత్తం రూ.138 కోట్లు ఖర్చు చేయడం, లీగల్ సెల్, స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టింది. చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్‌లు నిర్వహిస్తూ ఉచిత విద్య అందిస్తోంది.
ఈ బీమా పథకంతో టీడీపీ కోటిమంది కార్యకర్తల జీవితాలకు భరోసా కల్పిస్తూ, దేశ రాజకీయాల్లో మరింత వినూత్న ప్రాతిపదికను సృష్టించింది.
మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నేను, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్… pic.twitter.com/3d8sXDMVWh
— Lokesh Nara (@naralokesh) January 2, 2025