రాజకీయాల్లోనూ అలీ కమెడియన్ అయిపోయారా?

Is Actor Ali Become A Comedian In Politics, In Politics Ali Become Comedian, Ali, Ali Become A Comedian In Politics?, YCP, TDP, Jana Sena, Elections, General Elections, Actor Ali Politial News, Lok Sabha Elections, Assembly Elections, India, Political News, Mango News, Mango News Telugu
Ali,Ali become a comedian in politics?, YCP, TDP, Jana Sena, Elections, General Elections

ఏ ఆశించి సినీ నటుడు  అలీ వైసీపీ కండువా కప్పుకున్నారో కానీ.. సీఎం జగన్ మాత్రం ఆయనకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు.  2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అలీ వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల ముందు పార్టీలోకి చేరడంతో  అలీకి జగన్ టికెట్ కేటాయించే అవకాశం లేదు. టికెట్ దక్కకపోయినా కూడా అలీ మాత్రం పార్టీ తరుఫున గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అలా..అప్పుడు అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. దాని తర్వాత జగన్ సీఎం అవగానే.. అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారంటూ  ప్రచారం జరగడంతో అలీ కూడా తెగ సంబరపడిపోయారు.

కానీ రియల్ సీన్లోకి వచ్చేసరికి జగన్ ..కమెడియన్ అలీకి  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అయినా కూడా  టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న అలీ  పార్టీ బలోపేతం కోసం విసృతంగా కృషి చేస్తూ వైసీపీలో యాక్టివ్ పర్సన్‌గా  పని చేస్తున్నారు.  సామాజిక సాధికార యాత్రలో భాగంగా.. జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు గురించి ప్రజలకు బాగానే వివరించారు.

ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అలీ ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అలీతో పాటు అంతా అనుకున్నారు. అంతెందుకు నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాల కోసం అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు కూడా బాగానే వినిపించాయి. కానీ అలీకి  ఎక్కడా కూడా సీటు దక్కలేదు చివరకు రాజ్యసభ పదవిపై ఉన్న ఆశలు కూడా అడియాసలు అయ్యాయి.

కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ పాషాకు మైనారిటీ కోటాలో వచ్చే రాజ్యసభ సీటును  ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కర్నూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ పాషాకు కొన్ని కారణాల వల్ల సీటును కేటాయించలేకపోయానని…రెండేళ్ల తర్వాత హఫీజ్‌ పాషాను రాజ్యసభకు పంపుతానని చెప్పారు. అలా హఫీజ్‌ పాషాకు వైసీపీ అధినేత హామీ ఇవ్వడంతో అలీ సైలెంట్ అయిపోయారు.

కొద్ది రోజులుగా అలీ వైసీపీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే పార్టీ ఈమధ్య  ఎన్నికల ప్రచారం కోసం  విడుదల  చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అలీ పేరు లేకపోవడంతో తాజాతాజా హాట్ టాపిక్  అయిపోయింది.ఇక వైసీపీలో అలీ కథ ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది. పాపం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ  అలీ కమెడియన్ గానే మిగిలిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − four =