ఏపీలో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. లోక్‌సభ స్థానాలలో పోటీ పడటానికి నామినేషన్లు వేసినవాళ్లలో 49 మంది, అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ పడటానికి నామినేషన్లు వేసిన వారిలో 318 మంది తమతమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు.. మొత్తం 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 13 న జరుగనున్న ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడనున్నారని చెప్పింది.
ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో.. 25 పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 503 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 2,705 మంది కేండిడేట్లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి ఎక్కువగా.. విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు.మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే.. అత్యధికంగా 46 మంది కేండిడేట్లు తిరుపతి నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారని ఈసీ అధికారులు చెప్పారు . అలాగే అత్యల్పంగా చూసుకుంటే ఆరుమంది అభ్యర్థులు చోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY