ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జూన్ 18, శుక్రవారం నాడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఏడుగురు ఉండగా, అధికార వైఎస్సార్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. 8 మంది సభ్యుల పదవీకాలం ఒకేసారి ముగియడంతో శాసనమండలిలో సమీకరణాలు మారాయి. ఇప్పటివరకు మండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువుగా ఉండగా, ఇకపై వైఎస్సార్సీపీ బలం పెరగనుంది. టీడీపీ సభ్యుల సంఖ్య 22 నుంచి 15కు తగ్గగా, వైఎస్సార్సీపీ బలం 17 నుంచి 20కు పెరిగింది.
కాగా పదవీకాలం ముగిసిన వారిలో టీడీపీకి చెందిన గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావు, రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. అలాగే వైఎస్సార్సీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం ముగిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































