తిరుపతి రాజకీయాలపై యావత్ ఏపీ చూపు ఎప్పుడూ ఉంటుంది. సాక్ష్యాత్తు వెంకయ్యకు సంబంధించిన నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంపై ఫోకస్ ఎక్కువ. భూమన కరుణాకర్ రెడ్డి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలుపొందారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,70,762 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం పునర్విభజన ఉత్తర్వుల (1951) ప్రకారం 1951లో ఏర్పడింది. ఇక ఈ ఏడాది తిరుపతిలో త్రముఖ పోటి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి.
సీన్‌లోకి సీపీఐ:తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐ కూటమి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐలు సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తిరుపతి సహా 10 అసెంబ్లీ స్థానాలను సీపీఐకి కేటాయించాలని నిర్ణయించారు.త్వరలోనే తిరుపతికి తమ అభ్యర్థిని ప్రకటిస్తామని సీపీఐ వర్గాలు తెలిపాయి.
ట్రయాంగిల్ ఫైట్:అధికార వైసీపీ ఇప్పటికే నగర ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని బరిలోకి దింపగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. ఇప్పటికే రెండు పార్టీలు (వైసీపీ, జనసేన) అభినయ్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ, బీజేపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వామ్య పక్షం సీపీఐ ఇప్పటికే నగరంలో జోరుగా ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. దీంతో తిరుపతి అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీకి వేదిక కాబోతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ