షర్మిల వ్యాఖ్యలపై డోస్‌ పెంచుతున్న వైసీపీ!!

YCP Increasing Dose On Sharmila's Comments!!, YCP Increasing, Sharmila Comments, AP Congress News, Sharmila's Comments , YSRCP Dose , AP State Elections , CM Jagan , YS Sharmila, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Sharmila's comments , YSRCP Dose , AP State elections , CM Jagan , YS Sharmila

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. కుటుంబం, బంధుత్వం.. ఇవేమీ చూడకుండా అధికార, ప్రతిపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రత్యర్థి గెలవకుండా చేయడమే లక్ష్యంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు ఏపీలో ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి.. కాంగ్రెస్‌ ఏపీ చీఫ్‌, జగన్‌ చెల్లెలు షర్మిల చేస్తున్న కామెంట్లు హాట్‌టాపిక్‌ గా మారుతున్నాయి. ఆమె కడప బరి నుంచి గెలవడం ఖాయమైన నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డి పై కూడా బాణాలు వదులుతున్నారు షర్మిల. మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా షర్మిల.. అన్న జగన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పార్టీపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ విమర్శిస్తున్నారు. మహిళ పైగా.. జగన్‌కు చెల్లెలు కావడంతో వైసీపీ నేతలు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా ఉపేక్షిస్తే పార్టీకి ముప్పు తప్పదనుకున్నారో ఏమో.. షర్మిల వ్యాఖ్యలకు వాడివేడిగా బదులిస్తున్నారు. తాజాగా.. ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పరోక్షంగా వైఎస్‌ షర్మిలపై తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. విజ్ఞత కలిగిన వారు అలాంటి వ్యాఖ్యలు చేయరని, అలాంటి మాటలు వినడానికి కూడా బాగోవని చెప్పారు.

వాసిరెడ్డి పద్మ కూడా వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కోర్టులో ఉన్న విషయాలను షర్మిల ప్రస్తావించటం సరికాదన్నారు. షర్మిల నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిలవి పతన రాజకీయాలు అని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు కడప ప్రజలు చాలా కాలంగా చూస్తూనే ఉన్నారని కామెంట్‌ చేశారు. షర్మిల చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోవడం మా దురదృష్టం అని వాసిరెడ్డి పద్మ వాపోయారు. స్వార్థ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీతా.. చంద్రబాబుతో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు.

వైసీపీకి చెందిన ఇతర నాయకులు కూడా ఇటీవలి కాలంలో షర్మిలకు దీటుగా బదులిస్తున్నారు. ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించిన వైసీపీ నాయకులు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే మున్ముందు మరింత ధీటుగా బదులివ్వాలని వైసీపీ అధిష్ఠానంలో చర్చ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =