
రాజకీయాలు అయినా, సినీ ఇండస్ట్రీ అయినా వ్యాపార రంగం అయినా సరే వారి వారసులు రావడం అనేది సర్వ సాధారణ విషయం. ముఖ్యంగా ప్రతీ స్టార్ హీరో తన కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేయడానికి చూస్తుంటారు. ఇటు ఆ హీరోల అభిమానులు కూడా..తమ అభిమాన హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తే బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎదురు చూస్తుంటారు.
అదే వరుసలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీ కోసం కూడా పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెగా వారసులు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతుండగా వరుణ్ తేజ్ కూడా తనదైన మార్కుతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవన్ రేంజ్‌కు వెళ్లాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
దీంతోనే మెగా వారసుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడంటూ రేణు దేశాయ్‌ను పవన్ ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతానికి అకీరా నందన్‌కు యాక్టింగ్ చేయడానికి , హీరో అవడానికి ఆసక్తి లేదని ప్రతీసారి చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కూడా పవన్ ఫ్యాన్స్ అకీరా ఎంట్రీ ఎప్పుడని కామెంట్స్ చేస్తుంటారు. అయితే అకీరా ఫోటోలను,వీడియాలను రేణుదేశాయ్ ఎక్కువగా రిలీజ్ చేయరు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొడుకు గురించి ప్రస్తావన పెద్దగా తీసుకురారు. అయితే కూటమి ఊహించని విజయం సాధించడంతో రెండు రోజులుగా అకీరా నందన్ ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్నాడు.
జనసేన విజయభేరి మోగించడంతో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర.. ఆయన భార్య అన్నా లెజ్నివాతో పాటు, కొడుకు అకీరా నందన్ కూడా అభిమానులకు దండాలు పెట్టడం, అలాగే పిడికిలి బిగించి గెలిచాం అన్నట్లుగా సంకేతాలు చూపించడం వంటి ఫోటోలు, వీడియలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా.. తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటో దిగడం, ఆ తర్వాత రోజు ఏకంగా నరేంద్ర మోదీతో కలిసి ఫోటోలు, వీడియాలు బయటకు రావడంతో అకీరా ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా అకీరా నందన్ హాట్ టాపిక్ అయ్యారు. దీంతో గూగుల్ ట్రెండ్స్ లో కూడా అకీరా నందన్ పేరు తెగ వినిపిస్తోంది.
నిజానికి ఇది అకీరా నందన్‌కు సరైన సమయమే అని సినీ, పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే.. ఇలా చంద్రబాబు, నరేంద్ర మోదీలను కలిసి ఫోటోలు దిగడం, వాళ్లతో కలిసి మాట్లాడటం తప్పకుండా అకీరాకు కలిసి వస్తుందని అంటున్నారు. అంతేకాదు దీని వెనుక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఇన్ని రోజులు మీడియాకు, అభిమానులకు దూరంగా ఉంచిన పవన్.. కరెక్ట్ టైమ్ చూసి ఇలా తీసుకురావడం అకీరాను హైలెట్ చేయడానికే అని చెబుతున్నారు. దీంతో అకీరా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY