జయప్రకాశ్ నారయణ సపోర్టుపై టీడీపీ హర్షం

Lok Satta Support For Alliance, Alliance Lok Satta Support, Jayaprakash Narayan For Alliance, Jayaprakash, Lok Satta, Support for Alliance,TDP, Jayaprakash Narayan support, Latest Lok Satta Party News, Lok Satta Party Political News, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Jayaprakash,Lok Satta, support for alliance,TDP, Jayaprakash Narayan's support

ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో  టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తాను మద్దతు ఇస్తున్నట్టు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ  అనౌన్స్ చేశారు. దీంతో తనకు కులముద్ర వేసినా పర్వాలేదన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు మరీ ఇంతగా  దిగజారడం బాధాకరమని జేపీ ఆవేదన వ్యక్తం చేసారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీయే కూటమివైపే అని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. రెడ్డి సామాజిక వర్గం వైఎస్సార్సీపీ వైపు ఉంటే… కమ్మ, కాపులు కులాలు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నాయని జయప్రకాశ్ నారాయణ వివరించారు.

సంక్షేమమే పాలన అనుకుని, ఇలా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని జేపీ హెచ్చరించారు. అభివృద్ధి చేస్తేనే పాలన అని జేపీ క్లారిటీ ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశాలో నయమని జేపీ అన్నారు. ఎందుకంటే ఒడిశాలో రూ.26 వేల కోట్ల ఆదాయం ఉందని, కానీ అక్కడ ఎలాంటి ఆర్భాటాలకు పోరని.. అవసరం అయితేనే తప్ప అప్పులు చేయరని జయప్రకాశ్ నారాయణ వివరించి చెప్పారు

మరోవైపు జేపీ నిర్ణయంపై కూటమి హర్షం వ్యక్తం చేస్తోంది. ఇటు   ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించిన జయప్రకాశ్ నారాయణ  నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఇటు  లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జేపీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపైన కూడా సమగ్ర అవగాహన కలిగిన జయప్రకాశ్ నారాయణ వంటి మేధావి .. త్వరలో రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయమని జేపీ అన్నారు.

లోక్‌సత్తా జేపీ కొంత కాలంగా బీజేపీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు.అయితే ఈ మధ్య  ఓ కార్యక్రమంలో జగన్ తో కలిసి  పాల్గొనడంతో.. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరగగా.. అప్పుడే ఆయన ఆ విషయాన్ని ఖండించారు. కార్యక్రమంలో పాల్గొన్నానే తప్ప రాజకీయాలపై తాను చర్చించలేదన్నారు. కానీ దాని తర్వాత ఒకటి రెండుసార్లు ఇచ్చిన  ఇంటర్యూల్లో జగన్‌పై పాజిటివ్ కామెంట్స్ చేసినా కూడా  చాలా అంశాలపై వ్యతిరేకంగా కూడా స్పందించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడమే కాకుండా..పాలనను అంతం చేయాలని పిలుపునివ్వడం చాలామందిని ఆశ్చర్యంలో పడేసింది.

మాజీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయిన జేపీ.. లోక్ సత్తా  పేరుతో  స్వచ్చంద సంస్థను నడిపారు. రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని  చేయాలన్న లక్ష్యంతో  కొనసాగిన ఈ సంస్థ  వైపు అప్పట్లో యువత  ఆకర్షితులయింది. తర్వాత లోక్ సత్తాను స్వచ్ఛంద  సంస్థను రాజకీయ పార్టీగా మార్చి..  2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. కూకట్ పల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా  పోటీ చేయగా పార్టీ తరపున జేపీ ఒక్కరే విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత  పార్టీ నిర్వహణలో జయప్రకాశ్ చాలా  ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ  చేసి ఓడిపోయారు.   పార్టీ నేతల మధ్య పోరాటం, అంతర్గత కుమ్ములాటలు పెరగడంతో.. రాజకీయ పార్టీగా లోక్ సత్తా ప్రస్థానాన్ని ముగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + two =