ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ అంటే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఏపీఎండీసీ శాఖ ఎండీ చెక్ పెట్టారు.
పొరుగుసేవల కింద పనిచేస్తున్న 45 మంది సిబ్బందితో పాటు..కాంట్రాక్టు విధానంలో తీసుకున్నమరో 50 మందిని కూడా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగించారు.
2019-24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సులతో వీరందరినీ అప్పట్లో ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీరితో పాటుగా వివిధ శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే సిఫార్సులతో ఏపీఎండీసీలో అవసరం లేకపోయినా కూడా ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ 95మందికి ఈ ఐదేళ్లపాటు జీతాలు చెల్లించడంతో ఏపీఎండీసీపై అదనపు భారం పడినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎండీసీ పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలపై ఆరా తీసి ..ఇప్పుడు వీరికి చెక్ పెట్టారు ఈ ఉద్యోగుల కాంట్రాక్టు కాలం జూన్ తర్వాత నుంచి ముగిసినా.. వారి కాంట్రాక్టు ని తిరిగి పొడిగించకపోవడంతో.. అప్పుడు దాదాపు 150 మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. గడువున్న ఉద్యోగుల్లో 95 మందిని కూడా ఇప్పుడు తొలగించారు.