ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనవరి 26 న ప్రకటన!

Andhra Pradesh, AP Cabinet On Establishment of New Districts, AP Establishment of New Districts, AP New Districts, Formation of Committee on Establishment of New Districts, Formation of new districts, New Districts Establishment Announcement, New Districts Establishment Announcement in AP, New Districts Establishment In AP, New Districts in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే ఏడాది జనవరి 26 వ తేదీన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని అన్నారు.

ముందుగా రాష్ట్రంలోని లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, అరకు లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. మరోవైపు 26 జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే కమిటీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ నీలం సాహ్న అధ్యక్షత వహిస్తుండగా, సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి ఈ కమిటీలో సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here