ఏపీలో మంత్రి పదవి దక్కకపోవడంతో కొందరు టీడీపీ సీనియర్ నేతలు అలకబూనిన విషయం తెలిసిందే. ఈసారి 24 మందిని చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోకి తీసుకోగా.. అందులో 17 మంది కొత్తవారే ఉన్నారు. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కొందరు సీనియర్లు చివరికి షాక్ తగలడంతో అధిష్టానంపట్ల అసంతృప్తితో ఉన్నారు. అయితే మంత్రి పదవి దక్కక కొందరు అలకబూనితే.. ఓ నేత మాత్రం కేబినెట్‌లో చోటు దక్కినప్పటికీ అలకబూనారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఇటీవల తన మంత్రివర్గంలో ఆనంకు చంద్రబాబు స్థానం కల్పించారు. దేవదయా శాఖను ఆయనకు కేటాయించారు. ఈనెల 12 చంద్రబాబు నాయుడుతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రస్తుతం ఆనం అలకబూనారాట. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు, మీడియాకు కూడా అందుబాటులోకి రావడం లేదట. తనకు అత్యంత సన్నిహితులు, రోజూ కలిసే వాళ్లను కూడా ఆనం కలవకుండా దూరం పెడుతున్నారట. చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపు విషయంలో ఆనంతో చర్చించకుండానే దేవదాయ శాఖను కేటాయించారట. ఆ శాఖ ఇష్టం లేకనే ఆనం అలకబూనారని తెలుస్తోంది.
వాస్తవానికి నెల్లూరు నుంచి సీనియర్లు మంత్రి పదవి ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కచ్చితంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో తనకు చోటు దక్కుతుందని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గాన్ని టీడీపీ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు.. ఆనం రామనారాయణ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. దేవదాయ శాఖను ఆనంకు కేటాయించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రి వర్గాల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈక్రమంలో ఈసారి కూడా అదే శాఖ దక్కుతుందని ఆనం భావించారు. కానీ అది కాకుండా వేరే శాఖ దక్కడంతో అలకబూనారాట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE