ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉండటంతో పాటు.. మన దేశంలోను అత్యంత శక్తివంతమైన నేతగా కొనసాగుతున్నారు. వరుసగా మూడు సార్లు ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించి 60 యేళ్ల రికార్డును తిరగరాసారు. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెస్ యేతర పీఎంగా మోదీ రికార్డు నెలకొల్పారు. తాజాగా 2024 పవన్ పుల్ పొలిటీషియన్స్ -శక్తి వంతులైన రాజకీయ నాయకులను ఇండియా టుడే ప్రకటించింది.
వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీతో గెలుపొందిన నరేంద్ర మోదీ.. మూడోసారి మాత్రం మెజారిటీ మార్కుకు 32 సీట్ల దూరంలోనే ఆగిపోయారు. ప్రస్తుతం ఎన్డీఏ మిత్ర పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు. కాగా తాజాగా నరేంద్ర మోదీ.. మన దేశంలో వరుసగా అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా పేరు గడించారు. మోదీ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ జీ భాగవత్ రెండో స్థానంలో నిలిచారు. మూడో ప్లేస్ లో మోదీకి అత్యంత ప్రియమైన హోం మంత్రి అమిత్ షా ఉండగా.. నాలుగో స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలిచారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో నిలిచారు. అయితే ముఖ్యమంత్రుల్లో చూసుకుంటే మాత్రం చంద్రబాబే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయినా..తిరిగి రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. నరేంద్రమోదీ వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగాశారు.
ఒకవైపు అమెరికాతో.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న నేతగా మోదీ గుర్తింపు పొందారు. భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారని విశ్లేషించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్ర చూపుతూ ముందుకెళ్తున్నారు.చంద్రబాబు తర్వాతి స్థానాల్లో బిహార్ సీఎం నీతీష్‌కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని ప్రకటించింది.