
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుని.. అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీకుండా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే కేబినెట్ కొలువుదీరడంతో ఈ రోజు నుంచి అంటే జూన్ 21 నుంచీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజుల పాటు సభ కొనసాగుతుంది.ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక..జూన్ 22న స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రొటెం స్వీకర్‌గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఏపీలో గెలిచిన అన్ని పార్టీలకు చెందిన 174 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నరు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ వెంటనే వరుసగా 23 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు.
వీరందరి తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగిన వైఎస్సార్సీపీ ఈ సారి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడంతో.. సాధారణ ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే, అసెంబ్లీలో జగన్‌కు ఎక్కడ సీటు కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.ఇప్పటి వరకూ పాలన మీద కాకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ..ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది.
మరోవైపు అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివ్వం అన్న వైసీపీ నేతలందరి నోటిదురుసుకు చెక్ పెట్టేలా.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్ వైపు అందరి కళ్లు చూస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ , జనసైనికులు ఆ దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ గెలిచిన తర్వాత ఆయన వేసే ప్రతి అడుగు.. చేసే ప్రతి చర్యను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్‌ను పెంచేస్తున్న అభిమానులు..పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టే సమయం కోసం..అక్కడ ఆయన మాట్లాడే మాటల కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE