వైఎస్ షర్మిల పోటీ చేయబోయే స్థానాలు అవే..?

YS Sharmila Is Going To Contest The Same Seats, YS Sharmila Is Going To Contest, Sharmila Is Going To Contest, YS Sharmila, AP Elections, AP Congress, Pulivendula, Vijayawada, Guntur, YS Sharmila Latest News, Latest Poltical News, Latest AP Politics, AP CM Jagan, Mango News, Mango News Telugu
YS Sharmila, AP Elections, AP Congress, Pulivendula, Vijayawada, Guntur

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు వైఎస్ షర్మిల. ఆదివారం ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే తన సోదరుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై విమర్శల బాణాలు వదిలారు. వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ ఈసారి 175 అసెంబ్లీ స్థానాల్లో.. 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తేందుకు షర్మిల ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే షర్మిల ఈసారి రెండు స్థానాల నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారట. తన సొంత గడ్డ అయిన రాయలసీమతో పాటు.. అమరావతి ప్రాంతంలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తాను పోటీ చేయబోయే నియోజకవర్గాలు.. అక్కడ గెలుపు అవకాశాలు.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై షర్మిల కసరత్తు చేస్తున్నారట.

అయితే మొన్నటి వరకు కూడా షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. గతంలో ఆ స్థానం నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈక్రమంలో అన్నకు పోటీగా రంగంలోకి దిగాలని షర్మిల భావిస్తున్నారట. అదే సమయంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్‌లో చేరితే.. పులివెందుల నుంచి ఆమెను బరిలోకి దింపాలని కూడా షర్మిల అనుకుంటున్నారట.

ఇక అమరావతి ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలని షర్మిల అనుకుంటున్నారట. ఈక్రమంలో విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ స్థానాలను షర్మిల పరిశీలిస్తున్నారట. ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఓటు బ్యాంకు ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. అలాగే ఆయా స్థానాలకు కాంగ్రెస్‌కు కంచుకోటలు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారందరిని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావాలని షర్మిల ప్రయత్నిస్తున్నారట. తద్వారా విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచితీరుతానని షర్మిల భావిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =