తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనకు నిరసనగా ఏపీ బీజేపీ రేపు “చలో అమలాపురం” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో పోలీసులు నిర్బంధించారు. ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకుని నిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో సెక్షన్ 30, 144 అమలులో ఉండడంతోనే నిర్బంధించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఛలో అమలాపురం కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని ఏలూరు రేంజ్ డీఐజీ మోహానరావు తెలిపారు. అంతర్వేది ఘటన కేసును ప్రభుత్వం సీబీఐకు అప్పగించిందని పేర్కొన్నారు. కోనసీమలో పలు ప్రాంతాల్లో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు ఛలో అమలాపురం కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu






































