ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్

Andhra Pradesh, Andhra Pradesh Assembly, Andhra Pradesh Assembly Budget Session, Andhra Pradesh Assembly Budget Session To Begin, AP Assembly Budget Session 2020, AP Assembly Budget Sessions, AP Assembly Budget Sessions 2020, AP Budget Session, AP Budget Session 2020,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించింది. మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్:

  • బడ్జెట్‌ అంచనా వ్యవయం రూ.2,24,789.18 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

బడ్జెట్ కేటాయింపులు:

  • ఆర్థిక రంగం – రూ. 50,703 కోట్లు
  • విద్యరంగం – రూ.22,604 కోట్లు
  • పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
  • పశుగణాభివృద్ధి, మత్స్యరంగం – రూ.1279.78 కోట్లు
  • సోషల్‌ వెల్ఫేర్‌ – రూ.12,465.85 కోట్లు
  • వ్యవసాయరంగం – రూ.11,891 కోట్లు
  • జలవనరుల శాఖ – రూ. 11,805.74 కోట్లు
  • ఆరోగ్య రంగం – రూ.11,419.44 కోట్లు
  • మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ – రూ. 8150.24 కోట్లు
  • విద్యుత్‌ రంగం – రూ. 6,984.72 కోట్లు
  • ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
  • హోంశాఖ – రూ.5,988.72 కోట్లు
  • గృహ నిర్మాణ రంగం – రూ.3,691.79 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ – రూ. 3,520.85 కోట్లు
  • మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం – రూ.3456.02 కోట్లు
  • న్యాయశాఖ – రూ. 913.76 కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ – రూ. 856.64 కోట్లు
  • పెట్టుబడులు, మౌలిక వసతుల రంగం – రూ.696.62 కోట్లు
  • కార్మిక సంక్షేమం – రూ. 601.37 కోట్లు
  • ఐటీ రంగం రూ. 197.37 కోట్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu