ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రఖ్యాత మీడియా సంస్థ ‘ఎకనామిక్ టైమ్స్’ (Economic Times) ఏటా నిర్వహించే **’కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్’**లో భాగంగా చంద్రబాబు నాయుడును ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ (Business Reformer of the Year) పురస్కారానికి ఎంపిక చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ మరియు పారిశ్రామిక రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని జ్యూరీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
ముఖ్యంగా ఐటీ రంగం విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ గౌరవాన్ని అందించారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన దార్శనికతతో కూడిన పరిపాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
ఇక సీఎం చంద్రబాబుకి ఈ అవార్డు రావడంపట్ల ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “మా కుటుంబానికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన క్షణం ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎకనామిక్ టైమ్స్ సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది.” అని తెలిపారు.
అలాగే,.. “స్పష్టత, ధైర్యం, నిరంతర కృషితో భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లిన నాయకులు చాలా కొద్ది మంది మాత్రమే. పాలనలో సంస్కరణలు, వేగం, నమ్మకం అనే అంశాలపై ఆయన చూపిన అచంచల నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పారదర్శక పాలన దిశగా ఆయన చేసిన సేవలకు ఇది గొప్ప గౌరవం.” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering… pic.twitter.com/F8uE6ZafnN
— Lokesh Nara (@naralokesh) December 18, 2025
ఈ పురస్కారం లభించడం పట్ల కూటమి ప్రభుత్వ నేతలు, టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న శ్రమకు ఇది దక్కిన అరుదైన గౌరవమని వారు కొనిాడుతున్నారు. ఈ అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే ‘స్వర్ణాంధ్ర’గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు ఇటువంటి అంతర్జాతీయ గుర్తింపులు మరింత స్ఫూర్తినిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి పథంలో దూసుకుపోవడానికి ఇలాంటి సంస్కరణలు ఎంతో దోహదపడతాయి. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.






































