
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.హస్తిన వేదికగా ఈ రోజు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొంటున్నారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. ఈ సందర్భంగా వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపయోగపడతాయో చంద్రబాబు చెప్పబోతున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను కూడా ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు.
జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్ తో పాటు తాము చేపట్టనున్న ప్రణాళికలను నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వివరించరున్నారు. సేవల రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో బాబు వివరించనున్నారు . వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమైన నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం ప్రత్యేకంగా చర్చించారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు తొమ్మిదవ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అవుతుంది. రాష్ట్రపతిభవన్ లోని కల్చరల్ సెంటర్లో సమావేశమవుతుంది. ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ సహా 6 రాష్ట్రాలు బహిష్కరించాయి. కాగా నీతి ఆయోగ్ స్థానంలో పూర్వ ప్రణాళిక సంఘంను పునరుద్దరించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఇక, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్య పాలనతో, సేవలందించే ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి వాటి ద్వారా.. గ్రామీణ, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంచే అంశంపై ఈ భేటీ చర్చిస్తామని కేంద్రం అంటోంది. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టనెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE