ఏపీ సీఎం మనువడు దేవాన్స్ సరికొత్త రికార్డ్

AP CM Grandson Nara Devaansh Sets New Record

ఏపీ సీఎంగా తాతయ్య నారా చంద్రబాబు, ఏపీ మంత్రిగా తండ్రి లోకేష్ ఇప్పుడ తమదైన శైలితో రాజకీయాలలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా సీఎం మనువడు దేవాన్స్ చెస్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.చెస్లో అత్యంత వేగంగా పావులు కదపడంలో దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న దేవాన్ష్ ..వేగవంతమైన చెక్ మేట్ సాల్వార్ 175 పజిల్స్ ను సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందడంతో నారా వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు.

ఏపీ సీఎం మనవడు చెస్ ఛాంపియన్ షిప్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఈ సందర్బంలో ..ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఐ యామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ మై గ్రాండ్ మాస్టర్ అంటూ..మనవడి ప్రతిభను అభినందిస్తూ చంద్రబాబు పోస్ట్ పెట్టారు. అలాగే తల్లిగా ఎంతో ఎమోషన్ కు గురయ్యానంటూ నారా బ్రాహ్మణి కూడా పోస్ట్ చేశారు.

చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న..9 ఏళ్ల దేవాన్ష్ ఇటీవల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొన్న దేవాన్ష్ వేగవంతంగా పావులు కదిపాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5వేల334 సమస్యలు, కలయికలను పరిష్కరించి దేవాన్ష్ ఈ సరికొత్త రికార్డు సాధించాడు. తన వ్యూహాత్మకమైన ఆట తీరుతో, మంచి ప్రదర్శన కనిపించి చెక్ మేట్ మారథన్ అనే పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

దీంతో పాటు మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా దేవాన్ష్ సొంతం చేసుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 45 సెకండ్లలో పూర్తి చేయడంతో పాటు..9 చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లోనే అమర్చాడు. మొత్తం 32 కాయిన్స్‌ను మెరుపు వేగంతో సరైన స్థానాల్లో ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. న్యాయ నిర్ణేతలతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను.. పరిశీలించారు.

నిజానికి ప్రపంచ రికార్డు ఈవెంట్ కోసం దేవాన్ష్ కొన్ని వారాలుగా గట్టిగా కష్టపడుతున్నారు. రోజుకు 5 నుంచి 6 గంటల వరకు .. రాజశేఖర్ రెడ్డి అనే కోచ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఈవెంట్లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈ ఛాంపియన్షిప్ తో పాటు టాస్క్ జరుగుతున్న సమయంలో తన పక్కనే ఉండాలని తాతయ్యను దేవాన్ష్ కోరగా..కానీ ఏపీ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఈ సమయంలో చంద్రబాబు వెళ్లడానికి కుదరలేదట. అయినా సరే దేవాన్ష్ చెస్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నారా వారి కుటుంబంలో ఆనందోత్సవాలు నింపడంతో కూటమి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.