ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. అనంతపురం వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయానికి ఆదేశం

AP CM YS Jagan Orders Officials To Provide Rs 2000 Immediate Relief For The Flood Victims of Anantapur, AP CM YS Jagan Rs 2000 Immediate Relief For Flood Victims, AP CM YS Jagan Rs 2000 For Flood Victims, AP CM YS Jagan Mohan Reddy, Mango News, Mango News Telugu, Anantapur Flood, Rs 2000 Immediate Relief For The Flood Victims, Rs 2000 Anantapur Flood Victims, Anantapur Flood Victims, Anantapur Flood Relief, Anantapur Flood Rs 2000 Relief, AP CM YS Jagan Mohan Reddy Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలోని వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం జగన్ అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నిర్వాసితులైన వారికి ప్రభుత్వం తరపున అండగా నిలవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 2వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కూడా అందించాలని కూడా అధికారులకు సూచనలిచ్చారు.

రాష్ట్రంలో ఇంకా వర్షాల ముప్పు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావీయవద్దని చెప్పారు. అలాగే గర్భిణీలు, పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలని, వారికి తగిన ఆశ్రయం కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇంకా వర్షాలు తగ్గి పరిస్థితులు కుదుటపడ్డాక జిల్లాలో ఆస్థి నష్టం, పంట నష్టాలపై సర్వే చేయాలని, బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY