తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

Telangana Govt Made Biometric Attendance Mandatory for Students and Staff in All Higher Education Institutions, Telangana Govt Biometric Attendance Mandatory, Biometric Attendance Mandatory for Students, TS Biometric Attendance, Mango News, Mango News Telugu, Biometric Attendance Mandatory Higher Education Institutions, Biometric Attendance Mandatory TS, Telangana Biometric For Higher Education Institutions, Telangana Biometric Attendance Mandatory, Telangana State Latest News And Updates, Telangana Govt Made Biometric Attendance Mandatory, Telangana Govt Biometric Attendance Mandatory

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో విద్యార్థుల‌తో పాటుగా టీచ‌ర్లు, సిబ్బందికి కూడా బ‌యో మెట్రిక్ హాజ‌రు తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేయడానికి అవసరమైన విధంగా రాష్ట్రవ్యాప్తంగా హాజరును లెక్కించేందుకు మరియు వారి ఇ-పాస్ స్కాలర్‌షిప్/ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదలైన వాటి ప్రయోజనం కోసం, విద్యార్థులతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోని సిబ్బందికి ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క సెలవులను లెక్కించడం కోసం మరియు సిబ్బంది యొక్క డ్యూటీ వ్యవధిని లెక్కించడానికి కూడా బయోమెట్రిక్ హాజరును ఉపయోగించాలని చెప్పారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అన్ని సంస్థలకు సూచనలను జారీ చేయాలని తెలంగాణ కళాశాల ఎడ్యుకేషన్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =