అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

AP CM YS Jagan will Launch YSR Kanti Velugu Scheme On October 10,AP CM YS Jagan will Launch YSR Kanti Velugu Scheme,YS Jagan will Launch YSR Kanti Velugu Scheme On October 10,YS Jagan will Launch YSR Kanti Velugu Scheme, YSR Kanti Velugu Scheme,Jagan will Launch YSR Kanti Velugu Scheme On October 10, AP Political Live Updates 2019, AP Political News, AP Political Updates, AP Political Updates 2019,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే వైఎస్సార్‌ వాహన మిత్ర పధకాన్ని ప్రారంభించిన ఆయన అక్టోబర్ 10న వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం, అక్టోబర్ 15న రైతు భరోసా పధకాలను ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 10 గురువారం నాడు, అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం అయిన అక్టోబర్ 10న మొదలయ్యే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికి ఉచితంగా కంటి పరీక్షలు, వివిధ రకాల శస్త్రచికిత్సలు అందిచనున్నారు. మొత్తం 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కంటి వెలుగు పథకాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

[subscribe]