ఏసీబీ కస్టడీకి ఈఎస్ఐ స్కామ్ నిందితులు

ACB Takes ESI Medical Scam Accusers Into Custody, ACB Takes ESI Medical Scam Accusers Into Custody For Two Days, ESI Medical Scam Accusers, ESI Medical Scam Accusers Into Custody, ESI Medical Scam Accusers Into Custody For Two Days, ESI Medical Scam Latest Updates, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ మందుల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వారు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖ కోర్టు వారికీ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి తో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 9, బుధవారం నాడు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. వీరిని బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి, రెండు రోజుల పాటు విచారించనున్నారు.

ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నవారిలో డైరెక్టర్ దేవికా రాణితో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిరా, ఫార్మసిస్ట్‌ రాధిక, పార్మాకంపెనీ ప్రతినిధులు హర్షవర్థన్‌, నాగరాజు మరియు శ్రీహరి ఉన్నారు. ఏసీబీ ఈ కేసును దూకుడుగా విచారిస్తుంది, ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకోగా, మరిన్ని వివరాల కోసం ఏసీబీ అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fourteen =