ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 210, కృష్ణాలో 165, పశ్చిమగోదావరిలో 125, ప్రకాశంలో 121, గుంటూరులో 121, నెల్లూరులో 120 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,14,116 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 19 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13857 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,265 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,85,566 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ