సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

AP Deputy CM Pawan Kalyan Invited For Sri Sathya Sai Baba’s Centenary Celebrations

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. నవంబర్‌లో జరగబోయే బాబా వారి శతజయంతి ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు ఉత్సవాల ఏర్పాట్లు, పుట్టపర్తిలో జరుగనున్న సేవా కార్యక్రమాల వివరాలను పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “శ్రీ సత్యసాయి బాబా చూపిన సేవా మార్గం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీటి సరఫరా రంగాల్లో ట్రస్ట్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమైనవి,” అని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా, బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వేడుకల్లో పాల్గొంటానని ట్రస్ట్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి అదనంగా రూ.30 కోట్లు మంజూరు చేశారు. రాబోయే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here