గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహాన్ని మోసి మానవత్వం చాటుకున్న ఎస్ఐ శిరీష

ap dgp gautam sawang, AP DGP Gautam Sawang Lauds the Humanitarian Gesture of a Woman SI Sirisha, AP DGP Gautam Sawang Praise Woman SI K Sirisha, AP DGP Gautam Sawang Praise Woman SI Sirisha, DGP Gautam Sawang, DGP Gautam Sawang Praise Woman SI K Sirisha, DGP Gautam Sawang Praise Woman SI Sirisha, Humanitarian Gesture of a Woman SI Sirisha, kasibugga, kasibugga si sirisha, Mango News, SI K Sirisha, SI K Sirisha Of Kasibugga PS, SI Sirisha, Srikakulam, Srikakulam News, Woman SI Sirisha, woman si sirisha humanity

గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతదేహాన్ని స్వయంగా మోసి కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీష మానవత్వాన్ని చాటారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజక వర్గ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై శిరీషకు సమాచారం అందింది. వెంటనే ఆమె అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడినుంచి మృతదేహాన్ని అంత్యక్రియలు కోసం తరలించేందుకు చూడగా, స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సుమారు 2 కి.మీ దూరంలో ఉన్న రోడ్డువరకు ఎస్ఐ శిరీష స్వయంగా మృతదేహాన్ని మోసుకుని వెళ్లారు. ఆ తర్వాత మృతదేహాన్ని లలితా చారిటబుల్ ట్రస్ట్ కు అప్పజెప్పగా వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొప్ప మనసు చాటుకున్న ఎస్ఐ శిరీషను ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, తెలంగాణ పోలీస్ శాఖ సహా పలువురు పోలీసు అధికారులు అభినందించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ