ఏపీలో ఎంసెట్-2020 హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ప్రారంభం

AP EAMCET 2020, AP Eamcet 2020 Exam, ap eamcet 2020 latest news, AP EAMCET exam, AP Eamcet-2020 Hall Tickets, AP Eamcet-2020 Hall Tickets Download, AP Eamcet-2020 Hall Tickets Download Started, Eamcet 2020 Hall Tickets Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020‌ పరీక్షను సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను సెప్టెంబ‌ర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష కోసం హాల్ టికెట్స్ డౌన్ లోడ్ పక్రియ ప్రారంభమైంది. హాల్ టికెట్స్ ను sche.ap.gov.in వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంసెట్‌ పరీక్ష కోసం ఈ సంవత్సరం మొత్తం 2,72,720 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. పరీక్షలను రెండు షిఫ్టుల్లో ఉద‌యం 9 గంటల నుంచి 12 గంటల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంట‌ల‌ వ‌ర‌కు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడడం వంటి విషయాలను కచ్చితంగా ఆచరించేలా ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu