ఏపీలో ముగిసిన మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌటింగ్ ప్రారంభం

AP First Phase Panchayat Elections: Polling Completed Peacefully, Counting Started

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా మొత్తం 12 జిల్లాల్లో 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు 75.55% పోలింగ్ ‌నమోదయింది. పూర్తి పోలింగ్ శాతం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలపై ప్రకటన వచ్చిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఏదైనా స్థానంలో ఉప సర్పంచ్ ఎన్నిక మంగళవారం పూర్తికాకుంటే బుధవారం నాడు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ