గులాం నబీ ఆజాద్ నిజమైన స్నేహితుడు, కంట తడిపెట్టిన ప్రధాని మోదీ

congress leader Ghulam Nabi Azad, Ghulam Nabi Azad speech in Rajya Sabha, Mango News, Modi Speech Today, PM Modi bids emotional farewell to Ghulam Nabi Azad, PM Modi gets emotional, PM Modi gets emotional in farewell speech, PM Modi Gets Emotional In Rajya Sabha, PM Modi gets emotional while sharing bond with Ghulam Nabi, PM Modi Gets Emotional while Talking about Congress leader Ghulam Nabi Azad, PM Modi Speech, rajya sabha, Rajya Sabha Today

త్వరలో పదవీ విరమణ పొందనున్న నలుగురు సభ్యులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అందులో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ విపక్ష నేత గులాం న‌బీ ఆజాద్ గురించి మాట్లాడేటప్పుడు ప్ర‌ధాని మోదీ భావోద్వేగానికి గుర‌య్యారు. గులాం నబీ ఆజాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. గులాం న‌బీ ఆజాద్ పార్టీ గురించి ఆలోచిస్తాడని, అయితే అదే సమయంలో దేశం గురించి ఎక్కువ ఆలోచిస్తాడని చెప్పారు. అధికారంలో మరియు ప్రతిపక్షంలో 28 సంవత్సరాల అనుభవం కలిగి ఉండడం పెద్ద విషయమని పేర్కొన్నారు.

గులాం న‌బీ తనకు నిజ‌మైన స్నేహితుడ‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తానూ గుజరాత్‌కు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఆయనతో మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంఘటనలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు గులాం నబీ ఆజాద్ కన్నీటిపర్యంతమయ్యారని చెప్పారు. యాత్రికుల మృతదేహాలను గుజరాత్‌కు తరలించే విషయంలో ఉన్నతంగా స్పందించారని, అది తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్‌ కు ప్రధాని మోదీ సెల్యూట్‌ చేశారు. ఆయన అందరిని కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారని పేర్కొంటూ, ఆజాద్ సేవలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్లతో పాటుగా, పార్టీ అధ్యక్షులందరితో సమావేశం అవ్వాలని ఆజాద్ సూచించినట్టు తెలిపారు. ఆజాద్ ఎప్పుడూ ఇతరులపై అసభ్యకరమైన భాషను ఉపయోగించరని, ఈ విషయంలో ఆయన్నుంచి అందరూ నేర్చుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =