ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తునట్టు సమాచారం. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తునట్టు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో 13 జిల్లాలకు బదులుగా, మొత్తం 25 జిల్లాలుగా మారే అవకాశముంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారంగా ఏ ప్రకటన వెలువడలేదు. పూర్తీ వివరాలు త్వరలో ప్రకటించవచ్చు.
25 కొత్త జిల్లాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది:
1. అరకు
2. శ్రీకాకుళం
3. విజయనగరం
4. విశాఖపట్నం
5. అనకాపల్లి
6. కాకినాడ
7. అమలాపురం
8. రాజమండ్రి
9. నరసాపురం
10. ఏలూరు
11. మచిలీపట్నం
12. విజయవాడ
13. గుంటూరు
14. నరసరావుపేట
15. బాపట్ల
16. ఒంగోలు
17. నంద్యాల
18. కర్నూలు
19. అనంతపూర్
20. హిందూపూర్
21. కడప
22. నెల్లూరు
23. తిరుపతి
24. రాజంపేట
25. చిత్తూరు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu







































